దుబ్బాక ఉపఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలో రాయపోల్ పీఎస్ పరిధిలోని ఆరేపల్లి గ్రామ చౌరస్తాలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలు తొగుట సీఐ రవీందర్, రాయపోల్ ఎస్సై మహబూబ్ ఆధ్వర్యంలో చేశారు. తనిఖీలను గజ్వేల్ ఏసీపీ నారాయణ పర్యవేక్షించారు.
ఉపఎన్నికల నేపథ్యంలో వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు - ఎన్నికల నేపథ్యంలో వాహనాల తనిఖీ
దుబ్బాక ఉపఎన్నికల నేపథ్యంలో రాయపోల్ మండలం ఆరేపల్లి వద్ద పోలీసులు ప్రత్యేక తనిఖీ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. గజ్వేల్ ఏసీపీ నారాయణ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.
ఉపఎన్నికల నేపథ్యంలో వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు
ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా మద్యం, డబ్బు తరలించకుండా వాహన తనిఖీలు చేపట్టామని ఏసీపీ తెలిపారు. ఎన్నికలు దగ్గరపడుతున్న దృష్ట్యా అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిబ్బంది జాగ్రత్త వహించాలన్నారు.
ఇవీ చూడండి:'ప్రజలు ఎటువైపు ఉంటారో నిర్ణయించుకోవాలి'