సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికలో ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి భరోసా కల్పిస్తూ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ ఆధ్వర్యంలో మెయిన్ రోడ్, గాంధీ రోడ్, అంబేడ్కర్ రోడ్డు, బస్టాండ్ చౌరస్తా, మార్కెట్ చౌరస్తాలో ఫ్లాగ్ మార్చ్ చేశారు.
ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ తెలిపారు. కేంద్ర బలగాలు, తెలంగాణ స్పెషల్ పోలీస్ సిబ్బంది 300 మందితో పాటు వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్నగర్, జోగులాంబ గద్వాల, సూర్యాపేట, నిజామాబాద్, కామారెడ్డి, వనపర్తి జిల్లాల నుంచి 600 మంది పోలీసులు వచ్చినట్లు తెలిపారు.
ఎన్నికల నియమావళి ఎవరైనా ఉల్లంఘిస్తే.. డయల్ 100, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ వాట్సాప్ నెంబర్ 7901100100, దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల పోలీస్ నోడల్ అధికారి ఏసీపీ బాలాజీ మొబైల్ నెంబర్ 7901640499, సిద్దిపేట ఏసీపీ విశ్వప్రసాద్ మొబైల్ నెంబర్ 9490617009, గజ్వేల్ ఏసీపీ నారాయణ మొబైల్ నెంబర్ 8333998684, తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్ మొబైల్ నెంబర్ 9490617008, కంట్రోల్ రూమ్ నెంబర్ 8333998699కు ఫోన్ చెయ్యొచ్చని చెప్పారు.
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు కాని, అభ్యర్థులకు సంబంధించిన వ్యక్తులు కాని ఓటు వెయ్యమని ఇబ్బందులకు గురిచేసినా, డబ్బులు ఆశ చూపినా, ఓటర్లకు మద్యం సరఫరా చేసినా సీ-విజిల్ యాప్ ద్వారా ఫోటోలు, వీడియోలు తీసి అప్లోడ్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
ఇదీ చదవండి:రేపటి నుంచి అమల్లోకి కొత్త రెవెన్యూ చట్టం