సిద్దిపేట జిల్లాలో పేద ప్రజలకు పోలీసులు నిత్యం సేవలు అందిస్తూ అండగా ఉంటారని హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ పేర్కొన్నారు. హుస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామంలో నిరుపేద ప్రజలకు జనవికాస గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు, మాస్కులను అందజేశారు.
హుస్నాబాద్‌లో పేదలకు అండగా నిలిచిన పోలీసులు - essential goods to the poor people in Husnabad Siddipet district
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదప్రజలకు పోలీసులు నిత్యావసర సరుకులతోపాటు మాస్కులను పంపిణీ చేశారు. ప్రజల సహకారంతో డివిజన్ పరిధిలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని ఏసీపీ మహేందర్ పేర్కొన్నారు.
హుస్నాబాద్‌లో పేదలకు అండగా నిలిచిన పోలీసులు
కరోనా వ్యాధి నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించినందున గాంధీనగర్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గుర్తించి నిత్యావసర సరకులు అందించినట్లు తెలిపారు. పోలీసులు కష్టకాలంలో విధులు నిర్వహించటంతో పాటు పేదలను ఆదుకునే సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ దుండ్ర భారతి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Last Updated : Apr 21, 2020, 6:13 PM IST