సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో కరోనా వైరస్ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించడానికి పోలీసులు నిర్ణయించారు. హుస్నాబాద్‌లో ఏర్పాటు చేసిన మొబైల్ ఎల్ఈడీ ప్రచార తెరను ఏసీపీ మహేందర్ ప్రారంభించారు. హుస్నాబాద్‌లోని ప్రధాన కూడళ్లలో ఈ ప్రచార తెర వాహనంతో అవగాహన కల్పించారు.
కరోనాపై అవగాహనకు మొబైల్ వాహనం.. ప్రారంభించిన ఏసీపీ - police corona awareness program at husnabad in siddipeta district
కరోనా నివారణపై ప్రజలకు అవగాహన కల్పించడానికి హుస్నాబాద్‌లో పోలీసులు ఏర్పాటు చేసిన మొబైల్ ఎల్ఈడీ ప్రచార తెరను ఏసీపీ మహేందర్ ప్రారంభించారు.
హుస్నాబాద్‌లో కరోనా నివారణపై పోలీసుల అవగాహన
సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం డివిజన్లోని హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల్లో కరోనా వైరస్ నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ఏసీపీ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈనెల 14వ వరకు స్వీయ నియంత్రణ పాటించాలని, అవసరమైతే తప్ప బయటకు రావొద్దన్నారు.
ఇవీ చూడండి:'దేశంలో తబ్లీగీ వల్లే రెట్టింపు కేసులు'