సిద్దిపేట జిల్లా కోహెడ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ బైరగోని భీమయ్య కరోనాతో చికిత్స పొందుతూ గత నెల ఏప్రిల్ 25న మృతి చెందాడు. అతని కుటుంబం గురించి ఆరా తీసిన… హుస్నాబాద్ ఏసీపీ ఇంఛార్జీ అడిషనల్ ఎస్పీ మహేందర్, హుస్నాబాద్ సీఐ రఘుపతి రెడ్డి, కోహెడ ఎస్ఐ రాజ్‌కుమార్, ఇతర పోలీసు సిబ్బంది కలిసి వారికి ఆర్థిక సహాయం చేశారు. మొత్తం 1,61,000 వేల రూపాయలను జమ చేసి ఏసీపీ… మహేందర్ చేతుల మీదుగా(కానిస్టేబుల్) భీమయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు.
Police help: కానిస్టేబుల్ కుటుంబానికి సిబ్బంది సాయం - Siddipet District Koheda
కరోనాతో మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి సిద్దిపేట జిల్లా కోహెడ పోలీసు సిబ్బంది అండగా నిలిచారు. దాదాపు 1,61,000 వేల రూపాయలు వసూలు చేసి వారి కుటుంబానికి అందజేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ తరపున అన్ని రకాల సౌకర్యాలు అందిస్తామని ఈ సందర్భంగా హుస్నాబాద్ అడిషనల్ ఎస్పీ హామీ ఇచ్చారు.
Police help: కానిస్టేబుల్ కుటుంబానికి సిబ్బంది సాయం
సిబ్బంది, అధికారులు అందరూ కలిసి విరాళాలు ఇవ్వటం అభినందనీయమని హుస్నాబాద్ అడిషనల్ ఎస్పీ మహేందర్ తెలిపారు. భీమయ్య కుటుంబానికి డిపార్ట్మెంట్ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. డిపార్ట్మెంట్ తరపున రావలసిన అన్ని రకాల సౌకర్యాలు పోలీస్ కమిషనర్‌తో మాట్లాడి త్వరగా వచ్చే విధంగా కృషి చేస్తామని వెల్లడించారు.
ఇదీ చూడండి:కరోనా విపత్తు వేళ ప్రజల వద్దకు వెళ్లి సాయం చేస్తున్న ఎమ్మెల్యే సీతక్క