సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామానికి వెళ్లే రహదారిని మూసి వేయడాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అడ్డకున్నారు. దీంతో కాసేపు భాజపా కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. వెంకట్రావుపేట సమీపంలో ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకుని చేర్యాల పీఎస్‌కు తరలించారు.
భాజపా ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు.. పీఎస్‌కు తరలింపు - రఘునందన్ రావును అడ్డుకున్న పోలీసులు
మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా రహదారి మూసివేతను అడ్డుకునేందుకు వెళ్లిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు భాజపా కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. సిద్దిపేట జిల్లా వెంకట్రావుపేట సమీపంలో ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకుని చేర్యాల పీఎస్‌కు తరలించారు.
తన నియోజకవర్గంలో ప్రజలను కలిసేందుకు వెళ్తే ఎలా అడ్డుకుంటారని ఎమ్మెల్యే పోలీసులను ప్రశ్నించారు. ప్యాకేజీ చెల్లించకుండా దారి మూసివేత పనులు చేయడం సరికాదన్నారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు తాము పోరాటం చేస్తామని రఘునందన్ రావు స్పష్టం చేశారు. మల్లన్న సాగర్ జలాశయం నిర్మాణంలో భాగంగా ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామానికి వెళ్లే రహదారి మూసివేత పనులను గురువారం గ్రామస్థులు అడ్డుకున్నారు. పూర్తిస్థాయిలో ప్యాకేజీ చెల్లించిన తర్వాతనే రహదారిని మూసివేయాలని డిమాండ్ చేశారు.