సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని పలు వార్డుల్లో ప్రధానమంత్రి మోదీ దేశ ప్రజలనుద్దేశించి రాసిన లేఖను కరపత్రాలు ద్వారా ప్రతి కుటుంబానికి అందజేశారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి భాజపా నాయకులు ప్రజలకు అవగాహన కల్పించారు.
లాక్‌డౌన్ కాలంలో దేశ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గరిబీ కల్యాణ్ యోజన, ఆత్మ నిర్భర్ భారత్ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని నాయకులు తెలిపారు. ఈ ఏడాది నవంబర్ వరకు దేశంలో రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత ఆహారధాన్యాలను అందిస్తున్నారని పేర్కొన్నారు.