సిద్ధిపేట జిల్లా మిరిదొడ్డి మండలం లింగుపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కేరింగ్ సిటిజెన్స్ కలెక్టివ్ ఆధ్వర్యంలో కూలీలు ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఉపాధి మార్గం లేనందున ప్రభుత్వం ఉపాధి హామీ పనిదినాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు. లాక్డౌన్ కారణంగా నిరుద్యోగం పెరిగి ప్రజలంతా సొంత గ్రామాలకు తరలివచ్చారని, ఈ పరిస్థితుల్లో ప్రజలకు ఉపాధి కల్పించడానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం ముఖ్య పాత్ర పోషిస్తుందని అన్నారు.
ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని నిరసన - ఉపాధి హమీ పథకం
ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరించాలంటూ సిద్ధిపేట జిల్లా మిరిదొడ్డి మండలం లింగుపల్లిలో ఉపాధి హామీ కూలీలు ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధి హామీ పని దినాలు పెంచి.. మరిన్ని రోజులు పని కల్పించాలని డిమాండ్ చేశారు.
![ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని నిరసన Plawcards Show For Clear The Problems Of Labours In Siddipet District](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7817699-1086-7817699-1593429385646.jpg)
ఉపాధి పని దినాలను పెంచి ప్రజలకు ఉపాధి కల్పించాలని, ఉపాధి వేతనాలు కూడా పెంచాలని కేరింగ్ సిటిజన్ కలెక్టివ్ సంస్థ సభ్యులు కోరారు. ప్రతి కుటుంబానికి సంవత్సర కాలంలో 200 రోజుల పని దినాలను హామీ కల్పించి, రోజువారీ వేతనం రూ. 600 పెంచాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రణాళిక చేసిన పనులను మాత్రమే అమలు చేస్తూ.. ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేరింగ్ సిటిజెన్స్ కలెక్టివ్కు చెందిన ప్రవీణ్,నేలమ్మ సంఘం జిల్లా అధ్యక్షులు బాలమణి, ముత్యాలు, లావణ్య, మహిళా రైతుల హక్కుల వేదిక జిల్లా అధ్యక్షురాలు సుజాత, శ్వేత, సత్యనారాయణ, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్