స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపులో తెరాస అధిక స్థానాలను కైవసం చేసుకుని సిద్దిపేట జిల్లాలో గులాబీ జెండా ఎగురవేసింది. జిల్లాలో మెుత్తం 229 ఎంపీటీసీ స్థానాలుండగా, తెరాస ఏకంగా 153 సాధించింది. హారీశ్ రావు చాణక్యత, పార్టీ బలం వెరసి సిద్దిపేటలో తెరాస హోరెత్తించింది. 28 స్థానాలు సాధించిన కాంగ్రెస్ ద్వితీయ స్థానంలో నిలిచింది. భాజపా నాలుగు సాధించగా... తెదేపా, తెజస ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయాయి. వామపక్షాలు ఒక్క స్థానం దక్కించుకోగా, ఇతరులు 43 సీట్లలో విజయ ఢంకా మోగించారు.
23 జడ్పీటీసీ స్థానాలకు తెరాస 22 గెలుచుకుని పూర్తి ఆధిక్యం ప్రదర్శించింది. కాంగ్రెస్ ఒక్క స్థానానికే పరిమితమవ్వగా మిగతా పార్టీలేవి ఖాతా తెరవకుండానే చేతులెత్తేశాయి.
ఇవీ చూడండి : మాజీ ఎంపీ కవిత స్వగ్రామంలో భాజపా గెలుపు
# | తెరాస | కాంగ్రెస్ | భాజపా | ఇతరులు | వామపక్షాలు | మొత్తం |
జడ్పీటీసీ | 22 | 1 | 0 | 0 | 0 | 23 |
ఎంపీటీసీ | 153 | 28 | 4 | 43 | 1 | 229 |
మండలాల వారిగా ఎంపీటీసీ వివరాలు
మండలం | తెరాస | కాంగ్రెస్ | భాజపా | ఇతరులు | మొత్తం |
అక్కన్నపేట్ | 7 | 2 | 0 | 3 | 12 |
బెజ్జంకి | 9 | 0 | 1 | 0 | 10 |
చేర్యాల్ | 7 | 2 | 0 | 2 | 11 |
చిన్నకోడూర్ | 8 | 0 | 0 | 6 | 14 |
దౌల్తాబాద్ | 5 | 1 | 0 | 3 | 9 |
దుబ్బక్ | 5 | 0 | 1 | 7 | 13 |
గజ్వేల్ | 7 | 2 | 0 | 2 | 11 |
హుస్నాబాద్ | 4 | 2 | 0 | 0 | 6 |
జగదేవ్పూర్ | 6 | 4 | 0 | 1 | 11 |
కొహెడ | 8 | 1 | 2 | 2 | 13 |
కొమురవెల్లి | 4 | 2 | 0 | 0 | 6 |
కొండపాక | 9 | 3 | 0 | 3 | 15 |
మద్దూర్ | 6 | 4 | 0 | 1 | 11 |
మర్కూక్ | 6 | 0 | 0 | 1 | 7 |
మిరుదొడ్డి | 6 | 1 | 0 | 4 | 11 |
ములుగు | 8 | 1 | 0 | 1 | 10 |
నంగనూర్ | 9 | 1 | 0 | 1 | 11 |
నారాయణరావుపేట్ | 5 | 0 | 0 | 0 | 5 |
రాయ్పోల్ | 4 | 0 | 0 | 4 | 8 |
సిద్దిపేట(రూరల్) | 6 | 0 | 0 | 1 | 7 |
సిద్దిపేట(అర్బన్) | 8 | 0 | 0 | 0 | 8 |
తొగుట | 8 | 0 | 0 | 2 | 10 |
వర్గల్ | 8 | 2 | 0 | 0 | 10 |