సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ గ్రామంలో విద్యుదాఘాతంతో యువకుడు వేముల అఖిల్ మృతి చెందాడు. మరో ఇద్దరు యువకులు విద్యుత్ షాక్తో చేపలను పట్టేందుకు చెరువు వద్దకు వెళ్లారు. సర్వీస్ వైరును విద్యుత్ తీగలకు తగిలించి నీటిలో వదులుతుండగా ప్రమాదవశాత్తు షాక్కు గురై అఖిల్ మృతి చెందాడు.
చేపలవేటకు వెళ్లి విద్యుదాఘాతంతో యువకుడు మృతి - person in husnabad died due to current shock
విద్యుత్ షాక్తో చేపలను పట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్లో జరిగింది.
చేపలవేటకు వెళ్లి విద్యుదాఘాతంతో యువకుడు మృతి
మిగిలిన ఇద్దరు యువకులు అతన్ని బయటకు తీసి గ్రామస్థులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. యువకుని మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చూడండి : దివ్య శోభల యాదాద్రి - తుది దశకు పనులు