సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో రేషన్ దుకాణాల వద్దకు లబ్ధిదారులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కరోనా దృష్ట్యా సామాజిక దూరం పాటించకుండా గుమిగుడారు. కొన్ని చోట్ల ఒకరినొకరు తోసుకున్నారు. దాదాపు హుస్నాబాద్‌లో ఎనిమిది రేషన్ దుకాణాలు ఉన్నాయి.
సామాజిక దూరం పాటించని ప్రజలు - సిద్దిపేట జిల్లా ఈరోజు వార్తలు
హుస్నాబాద్‌లో ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర సరుకుల కోసం రేషన్ దుకాణాల ఎదుట లబ్ధిదారులు బారులు తీరారు. కరోనా దృష్ట్యా సామాజిక దూరం పాటించకుండా గుమిగుడారు. గుంపులుగా రాకుండా చర్యలు తీసుకోవాలని పలువురు వేడుకుంటున్నారు.
సామాజిక దూరం పాటించని ప్రజలు
ఒక్కొ దుకాణంలో 100 మంది లబ్ధిదారులకు కూపన్లు ఇచ్చారు. ఓ వైపు పలు చోట్లు యంత్రాలు మొరయిస్తుండగా.. మరో వైపు నిబంధనలు పాటించకుండా లబ్ధిదారులు గుంపులుగా చేరుతున్నారు. ప్రభుత్వ అధికార యంత్రాంగం స్పందించి లబ్ధిదారులు గుంపులుగా రాకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఇదీ చూడండి :తొలి కరోనా కేసుతో అధికారులు అప్రమత్తం