ప్రత్యేక తెలంగాణలోని ప్రజలంతా కులమతాలకు అతీతంగా పండుగలను జరుపుకోవాలని... అందరి సహకారంతోనే ఇది సాధ్యమవుతుందని గజ్వేల్ అదనపు సీపీ నరసింహరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో బక్రీద్ పండుగను సోదరభావంతో హిందూ ముస్లింలు కలిసి జరుపుకోవాలని సూచించారు. ఎక్కడైనా ఇందుకు భిన్నమైన ఘటనలు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని శాంతి కమిటీ సమావేశంలో నరసింహరెడ్డి తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా జిల్లా వ్యాప్తంగా శాంతియుత వాతావరణమే నెలకొందన్నారు.
గజ్వేల్‌లో శాంతి కమిటీ సమావేశం - గజ్వేల్‌లో శాంతి కమిటీ సమావేశం
బక్రీద్ పండుగను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో అదనపు పోలీస్ కమిషనర్ నరసింహరెడ్డి ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.

గజ్వేల్‌లో శాంతి కమిటీ సమావేశం