తెలంగాణ

telangana

ETV Bharat / state

డీసీపీ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పీస్​ మీటింగ్​ - dcp siddipet

బక్రీద్​ పండుగను శాంతియుతంగా నిర్వహించుకోవాలని డీసీపీ నర్సింహారెడ్డి సూచించారు. ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు తలెత్తినా సమీప పోలీస్​స్టేషన్​ను సంప్రదించాలని సూచించారు.

డీసీపీ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పీస్​ మీటింగ్​

By

Published : Aug 9, 2019, 8:59 PM IST

సిద్దిపేట పురపాలక కార్యాలయంలో బక్రీద్​ పండుగ సందర్భంగా పీస్​ మీటింగ్​ నిర్వహించారు. డీసీపీ నర్సింహారెడ్డి, మున్సిపల్​ ఛైర్మన్​ రాజనర్సు, వివిద సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. బక్రీద్​ పండుగ రోజు సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని డీసీపీ నర్సింహారెడ్డి తెలిపారు. శాంతియుతంగా పండుగ నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాంతి భద్రతల ఏసీపీ రామేశ్వర్​, పురపాలక, పోలీస్​ సిబ్బంది పాల్గొన్నారు.

డీసీపీ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పీస్​ మీటింగ్​

ABOUT THE AUTHOR

...view details