తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రతిరైతుకు రైతు బంధు.. సీఎం కేసీఆర్ లక్ష్యం'

ప్రతి రైతుకు రైతు బంధు రావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో నారాయణరావుపేట, సిద్దిపేట గ్రామీణ మండలాల్లోని 195 మంది లబ్ధిదారులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు.

By

Published : Aug 20, 2020, 8:19 PM IST

passbooks distribution in siddipet district by minister harish rao
సిద్దిపేటలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ

సిద్దిపేట పట్టణంలోని విపంచి కళా నిలయంలో నారాయణరావుపేట, సిద్దిపేట గ్రామీణ మండలాల్లోని 195 మంది లబ్ధిదారులకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. తెలంగాణలోని ప్రతి రైతుకు రైతు బంధు రావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని తెలిపారు.

20 ఏళ్లలో ఇంతమంచి కాలం కాలేదని, ప్రతి చెరువు నిండి మత్తడి పారుతోందని హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్న మంత్రి.. తెలంగాణ ప్రభుత్వ అభివృద్ది వల్ల 3 ఏళ్ల నుంచి ప్రజలు పట్టణాల నుంచి పల్లెబాట పట్టారన్నారు. సిద్దిపేట జిల్లాలో 2,700 చెరువులు నిండాయని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో చెరువుల కట్టలు తెగి పోయేవని, తెలంగాణ సర్కార్​ చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం వచ్చిందని వెల్లడించారు. కరోనా వస్తుందని ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని సూచించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details