కరోనా వచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పండిన పంటకు మద్దతు ధర ఇచ్చి, చివరి గింజ వరకూ ప్రభుత్వమే కొనుగోళ్లు చేసిన వారం రోజుల్లోపే రైతులకు బ్యాంకుల్లో డబ్బులు జమ చేసినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో 242 మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను మంత్రి పంపిణీ చేశారు.
రైతులకు మంత్రి హరీశ్‌రావు పాసుపుస్తకాలు పంపిణీ - మంత్రి హరీశ్‌రావు పాసుపుస్తకాలు పంపిణీ
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో 242 మంది లబ్ధిదారు రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను మంత్రి హరీశ్‌రావు పంపిణీ చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ రైతులు ఇబ్బంది పడకూడదని మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోళ్లు చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు.
![రైతులకు మంత్రి హరీశ్‌రావు పాసుపుస్తకాలు పంపిణీ passbook distribution at siddipet by minister harish rao](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7672068-722-7672068-1592485451683.jpg)
రైతులకు మంత్రి హరీశ్‌రావు పాసుపుస్తకాలు పంపిణీ
కొవిడ్ వచ్చి దేశమంతా చాలా ఇబ్బంది పడిందని... బిహార్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల నుంచి మొక్కజొన్నలు, వడ్లు తెచ్చినా.. తెలంగాణ ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేసిందన్నారు. ప్రతి రెండు, మూడు గ్రామాల్లో కొనుగోళ్లు కేంద్రాలు పెట్టి, టార్పాలిన్ కవర్లు పెట్టి ఎక్కడా రైతులు ఇబ్బందులు రాకుండా పండిన పంటను కొనుగోలు చేసినట్లు మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి:940 కేజీల గంజాయి పట్టివేత