ప్రతి గ్రామంలో రెడ్డి కమ్యూనిటీ హాలు, కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని జాతీయ నాయకులు పెండ్యాల కేశవరెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఐక్య వేదిక ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఇందుకు సంబంధించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు. సిద్దిపేట నుంచి హుస్నాబాద్ వైపు పాదయాత్ర కొనసాగించారు. అనంతరం బెజ్జంకి చేరుకున్నారు.
ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేశవరెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను నిరుపేద అగ్రకులాలకు అందేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.