తెలంగాణ

telangana

ETV Bharat / state

హుస్నాబాద్​లో సీఎం కేసీఆర్​ చిత్రపటానికి పాలాభిషేకం - paalabhishekam to cm kcr by trsv members in husnabad

రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థ ఏర్పాటుకు కృషి చేసిన సీఎం కేసీఆర్​ చిత్రపటానికి సిద్దిపేట జిల్లాలో టీఆర్​ఎస్వీ సభ్యులు పాలాభిషేకం చేశారు. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

paalabhishekam to cm kcr in husnabad
హుస్నాబాద్​లో సీఎం కేసీఆర్​ చిత్రపటానికి పాలాభిషేకం

By

Published : Apr 22, 2021, 3:05 PM IST

రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కృషి చేసిన సీఎం కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలుపుతూ.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్వీ సభ్యులు పాలాభిషేకం చేశారు. జిల్లాల పునర్విభజన చేపట్టి స్థానిక యువత 95 శాతం ఉద్యోగాలు పొందేలా సీఎం కృషి చేశారని సభ్యులు అన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగిందని సభ్యులు అన్నారు. ఆ సమస్య పునరావృతం కాకుండా కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వేగవంతం కానుంది'

ABOUT THE AUTHOR

...view details