తెలంగాణ

telangana

ETV Bharat / state

అనాథ బాలల సామూహిక పుట్టినరోజు వేడుకలు - orphans birthday celebrations

హుస్నాబాద్ బాలవికాస కేంద్రంలో అనాథ బాలలకు సామూహిక జన్మదిన వేడుకలు నిర్వహించారు. పిల్లలకు ఆర్థికంగా అండగా ఉంటామని ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.

orphans mass birthday celebrations in balavikasa center
అనాథ బాలల సామూహిక పుట్టినరోజు వేడుకలు

By

Published : Feb 18, 2020, 9:35 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో బాలవికాస సంస్థలో 12 మంది అనాథ బాలల సామూహిక జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ ఛైర్​పర్సన్​ అనిత, కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ తిరుపతి రెడ్డి హాజరయ్యారు. బాలవికాస మహిళా సభ్యుల సమక్షంలో సంస్థ మేనేజర్ లత... పిల్లల చేత కేట్​ కట్​ చేయించారు.

తల్లిదండ్రులు లేని బాధ సభలో పంచుకోవడంతో... అక్కడున్నవారంతా కంటతడి పెట్టారు. పిల్లల పోషణ, చదువులకు ఆర్థిక సాయం అందిస్తామని మున్సిపల్ వైస్​ ఛైర్​పర్సన్​, కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ ఛైర్మన్​ భరోసా ఇచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో... వైస్​ ఛైర్మన్​, కౌన్సిలర్లు నృత్యాలు చేసి అందరినీ అలరించారు.

అనాథ బాలల సామూహిక పుట్టినరోజు వేడుకలు

ఇదీ చూడండి:దక్షిణాసియా బెస్ట్ డిజిటల్ న్యూస్ స్టార్టప్ 'ఈటీవీ భారత్‌'

ABOUT THE AUTHOR

...view details