తెలంగాణ

telangana

ETV Bharat / state

సిద్దిపేటలో సేంద్రీయ ఉత్పత్తుల వెబ్​సైట్​ - ఆర్గానిక్​ ఉత్పత్తుల వెబ్​సైట్​ తాజా వార్త

మనం తీసుకునే ఆహారం వల్లే అనేక రోగాల బారిన పడుతున్నామని.. దానికి నివారణ చర్యగా  ప్రస్తుతం ప్రజల్లో సేంద్రీయ ఆహార ఉత్పత్తుల పట్ల అవగాహన పెరిగిందని మంత్రి హరీశ్​ రావు పేర్కొన్నారు. సిద్దిపేటలో సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్​ కోసం ఏర్పాటు చేసిన వెబ్​సైట్​ను ఆయన ప్రారంభించారు.

organic-website-launch-by-harish-rao-in-siddipet
సిద్దిపేటలో సేంద్రీయ ఉత్పత్తుల వెబ్​సైట్​

By

Published : Dec 4, 2019, 4:17 PM IST

క్యాన్సర్‌ వంటి వ్యాధులు‌ పెరుగుతుండటానికి మనం తీసుకునే కలుషిత ఆహారం, నీరు, గాలి కారణమని ఆర్థిక మంత్రి హరీష్ రావు చెప్పారు. విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడుతూ పంటలు‌ పండించడం వల్ల ‌క్యాన్సర్ కేసులు ‌ఎక్కువవుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో సేంద్రీయ ఆహార ఉత్పత్తులపై మక్కువ ‌ఏర్పడిందన్నారు. సేంద్రీయ ఉత్పత్తుల మార్కెటింగ్​ కోసం రైతులకు సంబంధించిన వివరాలు తెలియజేసేలా రూపొందించిన www.siddipetorganicproducts.com వెబ్​సైట్​ను మంగళవారం నాడు హరీశ్​రావు ప్రారంభించారు. ఈ వెబ్ సైట్‌లో సేంద్రీయ వ్యవసాయం ‌చేసే రైతు వివరాలు, పొలం, ఫోటోలు, పంట‌ వివరాలు, ఫోన్ నెంబరు వంటివి ఉంటాయన్నారు.

సేంద్రీయ ఉత్పత్తులను దళారీల ప్రమేయం లేకుండా రైతుల‌ నుంచే నేరుగా కొనుగోలు చేయవచ్చన్నారు. సేంద్రీయ రైతులకు మంచి ధర వచ్చేందుకు, కొనుగోలు దారులకు నిజమైన సేంద్రీయ ‌ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని మంత్రి హరీష్ రావు చెప్పారు. హైదరాబాద్​లో ఆర్గానిక్ ఉత్పత్తుల పేరుతో ఎరువులు, పురుగు మందులు వాడిన ఆహార ఉత్పత్తులు అమ్ముతున్నారని ఆక్షేపించారు. నిజమైన ఆర్గానిక్ ఉత్పత్తులు కావాలనుకునే వారు ఈ వెబ్ సైటు నుంచి కొనుగోలు‌చేయాలని సూచించారు.

సిద్దిపేటలో సేంద్రీయ ఉత్పత్తుల వెబ్​సైట్​

ఇదీ చూడండి: పోలీస్​ శాఖ వైపు అబ్బాయిలు.. వ్యవసాయం వైపు అమ్మాయిలు!

ABOUT THE AUTHOR

...view details