దేశ వ్యాప్తంగా చేపట్టిన భారత్ బంద్‌కు మద్దతుగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో విపక్ష నాయకులు రాస్తారోకో చేపట్టారు. నూతన వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ... నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రైతులకు మద్దతుగా హుస్నాబాద్‌లో విపక్షాల రాస్తారోకో - bharat bandh in husnabad
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో విపక్ష నాయకులు రాస్తారోకో చేపట్టారు. నూతన వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ... నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
opposition party leaders protest in husnabad
నిరసన కారణంగా రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు... ఘటనాస్థలికి చేరుకుని నిరసన తెలుపుతున్న పార్టీ నాయకులకు నచ్చచెప్పి ఆందోళన విరమింపజేశారు. హుస్నాబాద్‌లో బంద్ ప్రశాంతంగా కొనసాగింది.