సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఓపెన్ జిమ్‌ను ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ప్రారంభించారు. పట్టణంలోని స్థానిక పెద్ద చెరువు కట్ట మీద ఈ జిమ్ ఏర్పాటు చేశారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.
దుబ్బాకలో ఓపెన్ జిమ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే - ఎమ్మెల్యే రామలింగారెడ్డి తాజా వార్తలు
సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ఓపెన్ జిమ్‌ను ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ప్రారంభించారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయాలని పేర్కొన్నారు. ఈ ఓపెన్ జిమ్ సేవలు ఉపయోగించుకోవాలని కోరారు.
![దుబ్బాకలో ఓపెన్ జిమ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే దుబ్బాకలో ఓపెన్ జిమ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7864173-544-7864173-1593694827845.jpg)
దుబ్బాకలో ఓపెన్ జిమ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే
ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే చెట్లను పెంచాలని, ప్రతి రోజు వ్యాయామం చేయాలని ఎమ్మెల్యే తెలిపారు. దుబ్బాక పట్టణ ప్రజలు ఓపెన్ జిమ్ సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక మున్సిపల్ ఛైర్ పర్సన్ వనిత, దుబ్బాక కౌన్సిలర్లు, తెరాస నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ఇద చదవండి:పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ