సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం లింగపూర్ మాజీ సర్పంచ్ సందింటి లక్ష్మి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేసింది. తమ వ్యవసాయ బావి వద్దకు వెళ్లే నక్ష బాటను కొందరు వ్యక్తులు కబ్జా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం - మద్దూరులో పెట్రోల్ డబ్బాతో నిరసన
తమ వ్యవసాయ భూమికి వెళ్లే దారిని కొందరు వ్యక్తులు కబ్జా చేశారంటూ ఓ మహిళ తహసీల్దార్ కార్యలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరులో చోటు చేసుకుంది.
పెట్రోల్ డబ్బాతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం..
తమను బావి వద్దకు వెళ్లకుండా అడ్డుపడుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్వోకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. నిందితులపై కేసు నమోదు చేయాలని కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది.
ఇదీ చూడండి:'మా భూమిని అధికార పార్టీ నేతలు కాజేశారు'