మద్యం మత్తులో ద్విచక్రవాహనం డివైడర్ను ఢీకొట్టగా.. ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సిద్ధిపేట రూరల్ పీఎస్ పరిధిలోని పొన్నాల దాబా వద్ద చోటుచేసుకుంది. కొమురవెల్లి మండల పరిధిలోని మర్రిముచ్చల గ్రామానికి చెందిన చింతల లక్ష్మీ నారాయణ(28) ద్విచక్రవాహనంపై ఆటోను ఓవర్టేక్ చేసే క్రమంలో డివైడర్ను ఢీకొట్టాడు. రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు.
డివైడర్ను ఢీకొట్టిన ద్విచక్రవాహనం... ఓ వ్యక్తి మృతి - accident
ద్విచక్రవాహనం డివైడర్ను ఢీకొట్టగా... ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సిద్దిపేట రూరల్ పీఎస్ పరిధిలోని పొన్నాల దాబా వద్ద జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. మృతదేహాన్ని సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.
డివైడర్ను ఢీకొట్టిన ద్విచక్రవాహనం... ఓ వ్యక్తి మృతి
కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి: భద్రాద్రిలో భారీగా గంజాయి పట్టివేత.. నలుగురు అరెస్టు