సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్-జగదేవపూర్ రహదారిపై టాటా ఏస్, ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామానికి చెందిన పొట్ట చంటి, దొబ్బల మహేష్‌లు ద్విచక్రవాహనంపై ప్రజ్ఞాపూర్‌కు వచ్చారు. పని ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ప్రజ్ఞాపూర్‌లోని సెయింట్ మేరీ పాఠశాల ఎదురుగా జగదేవ్‌పూర్ వైపు నుంచి వస్తున్న టాటా ఏస్ వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది.
రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం - crime news
టాటా ఏస్ వాహనం, ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
![రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం one person died in road accident in siddipet district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7308466-846-7308466-1590159196364.jpg)
రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
ఈ ఘటనలో చంటి (30) అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన మహేష్‌ను స్థానికులు అంబులెన్స్‌లో గజ్వేల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మెరుగైన చికిత్స కోసం వైద్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుని కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు గజ్వేల్ సీఐ ఆంజనేయులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
ఇవీ చూడండి:డివైడర్‌ను ఢీకొట్టి కారు బోల్తా