తెలంగాణ

telangana

ETV Bharat / state

ట్రాలీ ఆటో, ద్విచక్ర వాహనం ఢీ... ఒకరి దుర్మరణం - సిద్దిపేట రోడ్డు ప్రమాదంలో ఐదుగిరికి గాయాలు

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం రుద్రారం, భూంపల్లి రహదారిపై ఓ ట్రాలీ ఆటో, ద్విచక్ర వాహనం ఒకటినొకటి ఢీకొన్నాయి. ఈ ఘనటలో ఓ వ్యక్తి మృతి చెందగా... ఐదుగురు గాయాలపాలయ్యారు.

one man died in siddipeta road accident
ట్రాలీ ఆటో, ద్విచక్ర వాహనం ఢీ... ఒకరి దుర్మరణం

By

Published : Jun 17, 2020, 12:53 PM IST

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రుద్రారం గ్రామానికి చెందిన అజారుద్దీన్, రాకేష్​లు భూంపల్లి నుంచి ద్విచక్రవాహనంపై రుద్రారం వస్తున్నారు. రవి, మల్లేశం, నరేష్, మహేశ్​లు ట్రాలీ ఆటోలో భూంపల్లి బయలుదేరారు. మార్గమధ్యలో ద్విచక్రవాహనం, ట్రాలీ ఆటోలు ఒకటినొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో అజారుద్దీన్ అక్కడికక్కడే మృతి చెందగా... మిగిలిన వారంతా గాయపడ్డారు.

స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు క్షతగాత్రులను సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:కరోనా నిర్ధారణ కోసమెళ్తే.. అంటుకునేలా చేస్తున్నారు!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details