తెలంగాణ

telangana

ETV Bharat / state

కలలో మందు కోసం వృద్ధురాలిని వేధిస్తోన్న భర్త - తెలంగాణలో మందు షాపులు ప్రారంభంట

ఓ ముసలావిడ ఎండలో మందు కోసం క్యూలో నిలబడింది. అవ్వా... మందు ఎవరి కోసమని అడిగాడు ఓ వ్యక్తి. తన భర్త కోసమని తెలిపింది ఆ వృద్ధురాలు. ఇంతలో మా ఆయన చనిపోయాడు. రోజూ కలలో వచ్చి మందు, విందు కోసం వేధిస్తున్నాడు. అందుకే మందు కొనడానికి షాప్​కొచ్చా అని వృద్ధురాలు చెప్పగా.. ఆశ్చర్యపోవడం అతని వంతైంది.

Old woman waiting for wine in que line
వృద్ధురాలిని వేధిస్తోన్న భర్త

By

Published : May 6, 2020, 12:30 PM IST

Updated : May 6, 2020, 4:02 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ఓ వైన్​ షాప్​ ముందు వృద్ధురాలు క్యూలో నిలబడి మందు కొనుగోలు చేసింది. సదురు ముసలావిడను పలకరించగా.. ఆ మందు తన భర్తకని వివరించింది. కానీ... ఆయన చనిపోయి 3 సంవత్సరాలైందని.. కలలో వచ్చి మందు కోసం వేధిస్తుంటాడని చెప్పగా నివ్వెరపోవడం స్థానికులవంతైంది.

దుబ్బాకకు చెందిన నర్సమ్మ.. భర్త మల్లయ్య 3 సంవత్సరాల క్రితం చనిపోయాడు. అప్పటినుంచి ప్రతినెల తన భర్తకు రొట్టెలు, మాంసం, మందు.. నెల నెల నైవేద్యంగా పెట్టేదాన్నని వివరించింది. కరోనా వైరస్ వల్ల దాదాపు రెండు నెలలు దుకాణాలు బంద్ కావడం వల్ల రోజూ కలలో వచ్చి ఆగం పట్టిస్తున్నాడని వాపోయింది. మందు, విందు కావాలని అడుగుతున్నాడని నర్సమ్మ చెప్పుకొచ్చింది. ఈ రోజు మందు దుకాణాలు తెరుస్తున్నారనే విషయం తెలుసుకుని వచ్చినట్లు తెలిపింది.

వృద్ధురాలిని వేధిస్తోన్న భర్త

ఇవీ చూడండి:తెరుచుకున్న మద్యం దుకాణాలు.. ఆనందంలో మందుబాబులు

Last Updated : May 6, 2020, 4:02 PM IST

ABOUT THE AUTHOR

...view details