సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని సత్యార్జున గార్డెన్ వాచ్మెన్ వేములవాడ నర్సయ్య అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఉదయం టిఫిన్ తీసుకొచ్చిన నర్సయ్య భార్య గదిలో పడి ఉన్న మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించింది. నర్సయ్య తల నుంచి తీవ్ర రక్తస్రావం కావటం వల్ల పలు అనుమానాలకు తావిస్తోంది. భార్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ కృష్ణారెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అనుమానాస్పద స్థితిలో వృద్ధుడి మృతి - old man suspected murder
సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో ఓ గార్డెన్లో వాచ్మెన్గా పనిచేస్తున్న వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

అనుమానాస్పద స్థితిలో వృద్ధుడి మృతి