సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండల కేంద్రంలోని కురుమడి ప్రాంతంలో కింది కుంట కట్టకు ఆనుకొని ఉన్న విద్యుత్ స్తంభం విరిగిపోయేలా ఉంది. ఈ స్తంభం నుంచి వేరే గ్రామానికి మెయిన్లైన్ ఉంది. ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే... అక్కడ వ్యవసాయం చేసుకునే ఎంతో మంది రైతులకు నష్టం వాటిల్లుతుంది. ఓ వైపు స్తంభం విరిగేలా ఉంటే, మరోవైపు కరెంట్ తీగుల కిందకి తాకుతున్నాయి. ఈ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకముందే ఈ విద్యుత్ స్తంభాన్ని మార్యాలని రైతులు కోరుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం.. ఈ విద్యుత్ స్తంభం - ఓ వైపు స్తంభం విరిగేలా ఉంది
ఓ వైపు స్తంభం విరిగేలా ఉంది.. మరోవైపు కరెంట్ తీగల కిందకి తాకుతున్నాయి. పక్కనే పంటపొలాలు. రోజూ రైతన్నలు అక్కడి నుంచే తిరుగుతారు. అయినా అధికారులు పట్టించుకోకుండా ఆ స్తంభాన్ని అలాగే వదిలేస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం.. ఈ విద్యుత్ స్తంభం
అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం.. ఈ విద్యుత్ స్తంభం
ఇవీ చూడండి: అప్పు కట్టలేదని మహిళపై 10 మంది దాడి