సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి తహసీల్దార్ కార్యాలయంలో మధ్యాహ్నం కావస్తున్నా ఒక్క అధికారీ విధులకు హాజరుకాకపోవడంపై ఎంపీటీసీ నర్సింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. సమయానికి కార్యలయానికి రావడం లేదంటూ రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన ఆకస్మికంగా కార్యాలయానికి వెళ్లారు.
మధ్యాహ్నం అయినా ఆఫీసులో పత్తాలేని అధికారులు - latest news of siddipeta mro office
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి తహసీల్దార్ కార్యాలయ అధికారులు సమయపాలన లేకుండా వ్యవహరించడంపై ఎంపీటీసీ నర్సింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకస్మికంగా కార్యాలయానికి వెళ్లిన ఆయన మధ్యాహ్నం 12 గంటలు కావస్తున్నా ఏ ఒక్క అధికారి విధులకు హాజరు కాకపోవడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.
సమయపాలన లేకుండా వీఆర్వోలు, ఆర్ఐ, కంప్యూటర్ ఆపరేటర్లు ఇలా పలువురు అధికారులు విధులకు హాజరుకాకపోవడం.. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందంటూ ఆయన మండిపడ్డారు. క్రింది స్థాయి సిబ్బందితో ప్రతిరోజు సమయానికి అనుకూలంగా అధికారులు వస్తున్నారా లేదా అని వివరాలను అడిగి తెలుసుకున్నారు. తమకేమీ పట్టనట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చట్టపరమైన చర్యలు తీసుకునేలా చేస్తానని అధికారులను ఎంపీటీసీ హెచ్చరించారు.
ఇదీ చూడండి :రాష్ట్రంలో 42 వేలు దాటిన కరోనా కేసులు.. 400పైగా మరణాలు