సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కేజీ టూ పీజీ విద్యలో భాగంగా బాలబాలికలకు వేరువేరుగా నూతన భవనాలను నిర్మించారు. ఈ భవనాల పరిశుభ్రం పనులను ప్రభుత్వం గుత్తేదారులకు అప్పగించింది. సంబంధిత గుత్తేదారు పనులు చేసేందుకు కార్మికులను నియమించుకుని పనులు చేయిస్తున్నారు.
ఐదు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు - telangana news
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన గజ్వేల్ విద్యా సౌధంలో పనిచేస్తున్న కార్మికులకు ఐదు నెలలుగా జీతాలు చెల్లించడం లేదంటూ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. భవనం ముందు కూర్చుని ఆందోళన వ్యక్తం చేశారు.
ఐదు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు
కానీ వారికి నెల నెలా సక్రమంగా జీతాలు చెల్లించకపోవడం వల్ల కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. ఐదు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదుంటూ కార్మికులు నిరసన బాట పట్టారు. తమకు వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : ద్విచక్ర వాహన షోరూంలో అగ్నిప్రమాదం... 26 వాహనాలు దగ్ధం