తెలంగాణ

telangana

ETV Bharat / state

NGT VISIT: రంగనాయకసాగర్‌, కొండపోచమ్మకు ఎన్జీటీ బృందం

జాతీయ హరిత ట్రైబ్యునల్​ బృందం నేడు రంగనాయక సాగర్‌, కొండపోచమ్మ సాగర్‌లతో పాటు పలు పనులను పరిశీలించనుంది. ఎన్జీటీలో దాఖలైన ఓ పిటిషనర్​ అభ్యంతరాలపై ఏర్పాటైన కమిటీ.. నిన్న కాళేశ్వరంలోని కొన్ని పంపుహౌస్​లను పరిశీలించింది.

By

Published : Aug 27, 2021, 12:05 PM IST

ngt will visit ranganayaka sagar
ngt will visit ranganayaka sagar

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశాల మేరకు ఏడుగురు నిపుణుల బృందం క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభించింది. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన పలువురు నిపుణులు దిల్లీ, చెన్నై, దెహ్రాదూన్‌ల నుంచి గురువారం కాళేశ్వరం ఎత్తిపోతలకు చేరుకున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం మండలంలోని లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్‌లను పరిశీలించారు. కరీంనగర్‌ జిల్లాలోని ఆరోప్యాకేజీని చూశారు.

నేడు మరికొన్ని ప్రాంతాల్లో..

ఈ బృందం రంగనాయకసాగర్‌, కొండపోచమ్మసాగర్‌లతో పాటు పలు పనులను నేడు పరిశీలించనుంది. ఎన్జీటీలో దాఖలైన ఒక పిటిషన్‌లో లేవనెత్తిన అభ్యంతరాలపై ట్రైబ్యునల్‌ విచారణకు ఆదేశిస్తూ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.

ఇదీచూడండి:central government: 'ఎటువంటి బొగ్గును వాడినా.. ఉద్గారాల నియమాలను పాటించాల్సిందే'

ABOUT THE AUTHOR

...view details