Physics Teacher Died Electric Shock at Siddipet :పెళ్లికి వేసిన పందిరి ఇంకా తీయలేదు. మామిడి తోరణాలు ఇంకా వాడిపోనేలేదు. కాళ్లకు రాసిన పారణి ఇంకా అలానే ఉంది. బంధువులు వారి స్వస్థలాలకు ఇంకా చేరలేదు. డీజే పాటలకు డ్యాన్స్‌లతో హోరెత్తించిన స్నేహితులు ఇంకా ఆ ఆనందంలోనే గడుపుతున్నారు. కోటి ఆశలతో.. కొండంతా బాధ్యతతో పెళ్లి చేసుకున్న ఆ నవ వరుడి ఆనందానికి అవధులు లేవు. తన జీవితంలోకి వచ్చిన భాగస్వామితో జీవితం ఎంత గొప్పగా తీర్చిదిద్దుకోవాలో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు.
రోడ్డు దాటుతూ కరెంట్ స్తంభాన్ని తాకి మహిళ మృతి.. విహార యాత్రకు వెళ్తుండగా ప్రమాదం..
New Groom Died due to Electric Shock : ఇంతలో పెండ్లి కుమారుడ్ని మృత్యువు కబలించడంతో ఇరు కుటుంబాల్లో పెను విషాదం నెలకొంది. పెళ్లి జరిగిన 24 గంటలు కాక మునుపేనవ వరుడు మృతి చెందడంతో బంధువులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. ఎంతో ఇష్టపడి పెద్దల సమక్షంలో తాళి కట్టి.. ఏడు అడుగులు వేసిన భర్త మరణ వార్తతో నవ వధువు శోక సంద్రంలో మునిగిపోయింది. ఆమె ఏడ్చిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. అంతవరకు సంతోషంగా గడిపిన నూతన పెండ్లి కుమారుడు.. మృతితో గ్రామం ఒక్కసారిగా మూగబోయింది.
కరెంట్ షాక్‌కు మూడు ఏనుగులు బలి.. అంత్యక్రియలు చేసిన గ్రామస్థులు
అసలు ఏం జరిగిందంటే..:సిద్దిపేట జిల్లా (Siddipet) వెంకటాపూర్ గ్రామంలో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. పెళ్లయిన మరుసటి రోజే విద్యుత్ షాక్‌తో వరుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడిగా (Physics Teacher) పనిచేస్తున్న నిరంజన్.. శనివారం వివాహం చేసుకున్నాడు. బంధువులను, స్నేహితులను పిలిచి ఎంతో గ్రాండ్‌గా వివాహం చేసుకున్నాడు.