తెలంగాణలో రెండో బాసరగా పేరుగాంచిన సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యాధరి ఆలయంలో నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నేడు సరస్వతీ రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారి వద్ద చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. అక్షర స్వీకారాలతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది.
సరస్వతీ దేవి అవతారంలో జగన్మాత.. - Navaratri celebrations in siddipet district
సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యాధరి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు కన్నులపండువగా సాగుతున్నాయి. మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీమాత సన్నిధిలో అక్షరాభ్యాసం నిర్వహించారు.
సరస్వతీ దేవి అవతారంలో జగన్మాత..
ఆలయ వ్యవస్థాపకులు రాయవరం చంద్రశేఖర సిద్ధాంతి ఆధ్వర్యంలో అమ్మవారికి తెల్లవారు జామున విశేష పంచామృతాభిషేకం జరిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం అన్నదానం నిర్వహించారు.
ఇదీ చదవండి :లలితా త్రిపుర సుందరీగా జగన్మాత