Natu Bombs in Husnabad Bus Stand Premises: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ ద్విచక్ర వాహనాల పార్కింగ్ సమీపంలో నాటు బాంబులు కలకలం రేపాయి. ఉదయం ప్రాంతంలో బాంబులు పేలిన శబ్దాన్ని విన్న తోపుడు బండి వ్యాపారస్థుడు వెంటనే సమాచారాన్ని ఆర్టీసీ సిబ్బందికి తెలియజేశాడు. వారు పోలీసులకు సమాచారం అందజేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు.
నాటు బాంబుల కలకలం.. స్వాధీనం చేసుకున్న పోలీసులు - తెలంగాణ విశేషాలు
Natu Bombs in Husnabad Bus Stand Premises: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ ఆవరణలో నాటు బాంబులు కలకలం సృష్టించాయి. ఒక్కసారిగా బాంబులు పేలిన శబ్దాన్ని విన్న తోపుడు బండి అతను ఆర్టీసీ సిబ్బందికి తేలిపాడు. దీంతో బాంబు స్క్వాడ్లు వచ్చి తనిఖీలు చేపట్టారు.
Natu Bombs in Husnabad Bus Stand
తనిఖీల్లో ఐదు నాటు బాంబులను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. నాటు బాంబులు అక్కడికి ఎలా వచ్చాయనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. బస్టాండ్ ఆవరణలో ఉన్న సీసీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఇవీ చదవండి: