భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై పోలీసుల ప్రవర్తనను జాతీయ బీసీ కమిషన్ సుమోటోగా తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి కమిషన్ నోటీసులు జారీ చేసింది. దురుసుగా ప్రవర్తించిన అధికారులు, పోలీసులపై కేసు ఎందుకు పెట్టలేదని కమిషన్ ప్రశ్నించింది. కేసు ఎందుకు నమోదు చేయకూడదో చెప్పాలని షోకాజ్ నోటీసు పంపింది.
ఆ పోలీసులపై చర్యలు ఎందుకు తీసుకోలేదు: తల్లోజీ ఆచారి - జాతీయ బీసీ కమిషన్ తాజా వార్తలు సిద్దిపేట
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై సిద్దిపేటలో పోలీసుల ప్రవర్తనను జాతీయ బీసీ కమిషన్ సుమోటోగా తీసుకుంది. దురుసుగా వ్యవహరించిన అధికారులు, పోలీసులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని డీజీపీకి కమిషన్ సభ్యుడు తల్లోజీ ఆచారి నోటీసులు పంపారు. బీసీ హక్కులను కాపాడటం రాజ్యంగ విధి అని నోటీసులో పేర్కొన్నారు.
ఆ పోలీసులపై చర్యలు ఎందుకు తీసుకోలేదు: తల్లోజీ ఆచారి
ఈ ఘటనపై నవంబర్ ఐదులోగా పూర్తి వివరాలతో సమాధానం ఇవ్వాలని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజీ ఆచారి ఆదేశించారు. బండి సంజయ్ బీసీ వర్గానికి చెందినవారని తెలిపారు. బీసీ హక్కులను కాపాడటం రాజ్యంగ విధి అని నోటీసులో పేర్కొన్నారు.
ఇదీ చదవండి:కొనసాగుతున్న బండి సంజయ్ దీక్ష.. పార్టీ శ్రేణుల ఆందోళన
TAGGED:
siddipeta issue update news