దుబ్బాక నియోజకవర్గం ఉపఎన్నిక నేపథ్యంలో చేగుంట మండలంలో... నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పర్యటించారు. మండలంలోని చిన్న శివనూర్, కర్నాల్ పల్లి, సోమ్లా తండా, రాంపూర్, గొల్లపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు రానివారు ఆవేదన చెందుతున్నారని... కొన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.
దుబ్బాకలో పర్యటించిన నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి - తెలంగాణ వార్తలు
దుబ్బాక ఉపఎన్నిక నేపథ్యంలో తెరాస నేతలు ప్రచారం ఏర్పాట్లు ముమ్మరం చేశారు. నియోజకవర్గంలోని చేగుంట మండలంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పర్యటించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
దుబ్బాకలో పర్యటించిన నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి
ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాంపూర్ గ్రామంలో వింత వ్యాధితో మరణిస్తున్న పశువులకు... రాష్ట్ర స్థాయి అధికారులతో పర్యవేక్షణ చేయిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మాసుల శ్రీనివాస్, జడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు వెంగళరావు, ఏఎంసీ ఛైర్మన్ ప్రవీణ్ కుమార్, పలు గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:రెవెన్యూ శాఖ పదోన్నతులపై కొనసాగుతోన్న సర్కార్ కసరత్తు