సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గ వ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలను మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తమ గ్రామాల్లో ఉన్న పుట్టల వద్దకు వెళ్లి పాలు పోసి నాగదేవతను పూజించారు. కష్టాలు తొలగి సుఖసంతోషాలను ఇవ్వమంటూ అమ్మవారికి వేడుకున్నారు.
చల్లగా చూడు తల్లీ అంటూ నాగదేవతకు పూజలు - nagula panchami celebrations in gajwel
నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా మహిళలు భక్తి శ్రద్ధలతో నాగదేవత పూజలు నిర్వహించారు. పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు.
చల్లగా చూడు తల్లీ అంటూ నాగదేవతకు పూజలు
గజ్వేల్ పట్టణంలోని అయ్యప్ప దేవాలయం ప్రాంగణంలో ఉన్న నాగదేవత ఆలయానికి వేకువజాము నుంచే భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- ఇవీ చూడండి:రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..