సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచవరం గ్రామంలో శ్రీలక్ష్మి నరసింహ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో అత్యంత కీలకమైన రథోత్సవం కన్నుల పండువగా సాగింది. సర్వాంగ సుందరంగా అలంకృతులైన ఉత్సవమూర్తులు రథంపై ఊరేగుతూ వేలాదిగా భక్తులకు అభయమిస్తూ ముందుకు సాగారు.
ఈ వేడుకను చూసేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ ఎత్తున హాజరయ్యారు. రథానికి ముందు భక్తులు కోలాటాలు, నృత్యాలతో స్వామివారికి స్వాగతం పలికారు. మంగళహారతులతో మొక్కులు చెల్లించుకున్నారు.