దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆత్మగౌరవంగా.. ఆరోగ్యంగా ఉండాలన్నదే నా తపన అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు. సిద్దిపేట జిల్లాలో నంగునూర్ మండలం మైసంపల్లిలో సేంద్రియ పంటలు పండిస్తున్న 40 మంది రైతులకు ఆవులను పంపిణీ చేశారు. మీకు ఇచ్చిన మాట ప్రకారం ఆవులు ఇస్తున్న... మీరు ఆరోగ్యంగా ఉండాలన్నదే నా తపనని హరీశ్ అన్నారు. రసాయనిక ఎరువులు వాడకం వలన కాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నామన్నారు. సేంద్రియ వ్యవసాయంతో ప్రాణాంతక వ్యాధులు దూరం అవుతాయని వివరించారు.
మీరు ఆరోగ్యంగా ఉండాలనదే నా తపన: హరీశ్ - సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
మీరు ఆరోగ్యంగా ఉండాలన్నదే నా తపన. సేంద్రియ వ్యవసాయంతో మంచి పంట... మంచి ఆరోగ్యం... ప్రోత్సాహకం లభిస్తుంది. ప్రజల ఐక్యత, భాగస్వామ్యంతో పల్లెలను అభివృద్ధి చేసుకుందాం. యువత టెక్నాలజీని అందిపుచ్చుకుని.. అద్భుతమైన పంటలు పండించి.. ఆదర్శంగా నిలవాలి. ఆత్మగౌరవంగా బతికే అన్నదాతలకు, తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాలి. ------ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
మీరు ఆరోగ్యంగా ఉండాలనదే నా తపన