సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ను సమస్యలు లేని మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ కార్యవర్గం అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే సతీశ్ కుమార్ తెలిపారు. హుస్నాబాద్‌లోని మున్సిపల్ కార్యాలయంలో ఛైర్మన్ ఆకుల రజిత అధ్యక్షతన బడ్జెట్ ఆమోదానికి సర్వసభ్య సమావేశం జరిగింది. మున్సిపల్ కార్యవర్గం, అధికారులు, సిబ్బంది పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రచించాలని సూచించారు.
'మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దేలా కృషిచేయాలి'
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. హుస్నాబాద్‌ను సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచించాలని ప్రజాప్రతినిధులు సూచించారు.
'మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దేలా కృషిచేయాలి'
పట్టణంలో ఉన్న ప్రధాన సమస్యలను మొదట గుర్తించాలని, వాటిని అనుకున్న సమయంలో పూర్తి చేయాలన్నారు. రాబోయేది వర్షాకాలం అయినందున రోడ్ల సమస్యలు ఉంటే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలనీ లేకుంటే ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు.
ఇదీ చూడండి:కరోనా పంజా: 24 గంటల్లో 122 మరణాలు, 3525 కేసులు
TAGGED:
rainy season