మూల నక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యాధరి క్షేత్రంలోని సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి నేతృత్వంలో... వేదపండితులు ఉత్సవానికి అంకురార్పణ చేశారు.
సరస్వతి అమ్మవారికి మూలా నక్షత్ర పూజలు - వర్గల్లో సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు
సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యాధరి క్షేత్రంలో అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్ర పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు ఆలయ వ్యవస్థాపకులు రాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి నేతృత్వంలో అమ్మవారికి విశేషంగా మూలా నక్షత్ర పూజలు నిర్వహించారు.

సరస్వతి అమ్మవారికి మూలా నక్షత్ర పూజలు
ఈ సందర్భంగా మూలా నక్షత్ర విశేష పూజలు, లక్ష పుష్పార్చన, లక్ష కుంకుమ అర్చన, చండీ హోమం, లలిత పారాయణం తదితర కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఆలయాల సముదాయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దగా, విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో పుణ్యక్షేత్రం కిటకిటలాడింది. భక్తులకు ఆలయ నిర్వాహకులు తీర్థప్రసాదాలతో పాటు మహాప్రసాదం అందజేశారు.
ఇదీ చూడండి:'అటవీ అధికారులతో ఎమ్మెల్యే యుద్ధం'