సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డిఓ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో దళిత సంఘాలు ధర్నా నిర్వహించాయి. 11 నెలల కిందట అక్కన్నపేట మండలం కేశనాయక్ తండాకు చెందిన గిరిజన యువతి లావుడ్య కల్పనను ప్రేమించి మోసం చేసి పోలీస్ కానిస్టేబుల్ హత్య చేశాడని ఆరోపణలు ఉన్నా ఇప్పటి వరకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్డిఓ కార్యాలయం ముందు దళిత సంఘాల ధర్నా - ఆర్డిఓ కార్యాలయం ముందు దళితసంఘాల ధర్నా
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డిఓ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో దళిత సంఘాలు ధర్నా నిర్వహించాయి. గిరిజిన యువతి కల్పనను ప్రేమించి మోసం చేసి హత్య చేశాడనే ఆరోపణలు ఉన్నప్పటికీ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆర్డిఓ కార్యాలయం ముందు దళితసంఘాల ధర్నా
దిశ నిందితులను ఎన్కౌంటర్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేసిన పాలకులు గిరిజన యువతి హత్యను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. కల్పన కేసును సీఐడీకి అప్పగించి దోషులను కఠినంగా శిక్షించాలని, కుటుంబానికి ప్రభుత్వం తరఫున అందాల్సిన ఎక్స్ గ్రేషియాను వెంటనే అందించాలని డిమాండ్ చేశారు.
ఆర్డిఓ కార్యాలయం ముందు దళితసంఘాల ధర్నా
ఇవీ చూడండి: దిల్లీ, మహారాష్ట్రలో 'పౌర'చట్టంపై నిరసనజ్వాల