దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంది. మిడిదొడ్డి మండలం అల్వాలలో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ఎంపీ రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. రోడ్ షో నిర్వహిస్తూ.. శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. దుబ్బాక అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతోందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
మాయమాటలతో ప్రజలను మోసగిస్తున్నారు: రేవంత్ రెడ్డి - దుబ్బాకలో కాంగ్రెస్ రోడ్‌షో
మాయమాటలు చెప్పి తెరాస ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దుబ్బాకలో అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతోందని ఆయన పేర్కొన్నారు.
మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు: రేవంత్ రెడ్డి
ముత్యం రెడ్డి బతికున్నన్ని రోజులు దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేశారని... ఆయన ఆశయం నెరవేర్చేందుకు తన కొడుకు శ్రీనివాస్ రెడ్డిని పంపారని తెలిపారు. తెరాస ప్రభుత్వం ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తోందని ఆరోపించారు.
ఇదీ చూడండి:తెరాసకు బుద్ధి చెప్పే సమయం వచ్చింది: ఉత్తమ్