తెలంగాణ

telangana

ETV Bharat / state

'అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచేలా పనిచేయాలి' - COUNCIL FIRST MEETING HELD IN GAJWEL PRGNAPOOR

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్​లో పురపాలక సంఘ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎంపీ కొత్తకోట ప్రభాకర్​రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

MP PRABHAKAR REDDY ATTENDED IN GAJWEL COUNCIL FIRST MEETING
MP PRABHAKAR REDDY ATTENDED IN GAJWEL COUNCIL FIRST MEETING

By

Published : Feb 17, 2020, 5:14 PM IST

సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తూ అభివృద్ధిలో ఆదర్శంగా నిలవాలని గజ్వేల్​ పురపాలక సంఘ కౌన్సిలర్లకు ఎంపీ ప్రభాకర్​ సూచించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్​లో పురపాలక సంఘ సర్వసభ్య సమావేశానికి ఎంపీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఛైర్మన్ రాజమౌళి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కౌన్సిలర్లు పలు సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. గజ్వేల్ మున్సిపాలిటీ ఇప్పటికే అభివృద్ధిలో రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుందని ఎంపీ తెలిపారు. త్వరలోనే మున్సిపాలిటీలో అంతర్గత మురుగు కాలువల నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని ఎంపీ హామీ ఇచ్చారు.

'అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచేలా పనిచేయాలి'

ఇవీ చూడండి:ట్విట్టర్​ ట్రెండింగ్​లో హ్యాపీ బర్త్​డే కేసీఆర్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details