తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాపై అవగాహన కల్పిస్తూ గుర్రంపై ఎంపీ ర్యాలీ - mp kotha prabhakar reddy horse ride on corona awareness in siddipet district centre

కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి గుర్రంపై ర్యాలీ నిర్వహించారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు.

ride on horse for awareness on corona
కరోనాపై అవగాహన కోసం గుర్రంపై ర్యాలీ

By

Published : Apr 23, 2021, 3:38 PM IST

కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మెదక్​ ఎంపీ కొత్త ప్రభాకర్​ రెడ్డి గుర్రంపై ర్యాలీ నిర్వహించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ చౌరస్తా నుంచి ఈ ర్యాలీ చేపట్టారు.

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్​ను అరికట్టేందుకు ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీ సూచించారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా నియంత్రణకు స్వీయ రక్షణే సరైన మార్గమని వీధివీధిలో అవగాహన కల్పించినట్లు చెప్పారు.

స్థానిక పాత్రికేయుడు నాగరాజు కరోనాతో చనిపోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారుఖ్​ హుస్సేన్​, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఎప్పుడు పెంచుతారు : హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details