సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పెద్ద గుండవెల్లి, తిమ్మాపూర్, పద్మనాభునిపల్లిలో ఎన్ఆర్ఈజీఎస్ పథకం క్రింద సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
సీసీ రోడ్లకు ఎంపీ, ఎమ్మెల్యే శంకుస్థాపన - సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన
దుబ్బాక మండలంలోని పులు గ్రామాల్లో ఎంపీ, ఎమ్మెల్యే సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. పెద్ద గుండవెల్లిలో రేణుక ఎల్లమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
![సీసీ రోడ్లకు ఎంపీ, ఎమ్మెల్యే శంకుస్థాపన mp koth aprabhakar reddy mla ramalinga reddy foundation stone for cc roads](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6360952-thumbnail-3x2-shanku.jpg)
సీసీ రోడ్లకు ఎంపీ, ఎమ్మెల్యే శంకుస్థాపన
పెద్ద గుండవెల్లిలో శంకుస్థాపన అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే స్థానికంగా ప్రసిద్ధి చెందిన రేణుక ఎల్లమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు కడతల రవీందర్ రెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలత, ఆయా గ్రామాల సర్పంచులు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీసీ రోడ్లకు ఎంపీ, ఎమ్మెల్యే శంకుస్థాపన
ఇదీ చూడండి:సింధియా రాజీనామా వెనుక జరిగిన కథ ఇదే...