సిద్దిపేట జిల్లాలోని, సిద్దిపేట, మెదక్ రాజీవ్ రహదారిపై వానరాలు ఉండడం వల్ల రోడ్డుపై వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది. రైతులు తాము ఆరుగాలం పండించిన పంటను కోతులు నాశనం చేస్తున్నాయని తరిమి కొడుతూ పొలిమేరలను దాటిస్తున్నారు. అందులో భాగంగా మిరుదొడ్డి మండలం ధర్మారం, దుబ్బాక మండలం హబ్సీపూర్ సరిహద్దులో రైతులు కోతులను తరిమి కొడుతుండగా రాజీవ్ రహదారిని వానరాలు దిగ్బంధం చేసినట్లుగా రైతులు తెలిపారు.
రహదారిని దిగ్భందం చేసిన కోతులు - వానరాల బీభత్సం తాజా వార్త
సిద్దిపేట జిల్లాలోని రాజీవ్ రహదారిపై వానరాలు ఉండడం వల్ల వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. రోజు తమ ఊర్లల్లోని ఏ పంటనూ ఇవి బతకనివ్వడం లేదని ప్రజలపై దాడి చేస్తున్నాయంటూ వాపోయారు. తమ పంటను కాపాడుకునే క్రమంలో వానరాలను పొలిమేరలు దాటేలా తరిమికొట్టారు.
రహదారిని దిగ్భందం చేసిన కోతులు
వానరాలు ఉండడం వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కోతుల వలన పంటలు పండించాలంటే భయమేస్తుందని, ప్రభుత్వం ఎలాగైనా అడవులు ఉన్న చోటికి ఈ కోతులను తరలించి, తమ సమస్యలు పరిష్కరించాలని రైతులు కోరారు.
ఇదీ చూడండి: బావిలో పడి యువకుడి ఆత్మహత్య