అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి కమిషనరేట్ పరిధిలోని వినాయక మండపాల భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్రీ డి. జోయల్ డేవిస్ తెలిపారు. ఆధునిక పరిజ్ఞానంతో నేరాలను నియంత్రించడంతో పాటు గంటల వ్యవధిలో నేరస్థులను గుర్తించటంలో సిద్దిపేట కమిషనరేట్ పోలీసులు విజయం సాధిస్తున్నట్లు వెల్లడించారు. టెక్నాలజీని ఉపయోగించి వినాయక మండపాలను ఆన్లైన్లో నమోదుచేసి అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో మొత్తం వినాయక విగ్రహాలు 3 వేల 138 కాగా.... సిద్దిపేట డివిజన్లో వేయి183, గజ్వేల్ డివిజన్లో వేయి 265, హుస్నాబాద్ డివిజన్లో 690 మండపాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ఆధునిక టెక్నాలజీతో వినాయక మండపాల పర్యవేక్షణ - Monitoring of Vinayaka Mandapas with modern technology
ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాలను నియంత్రించి... గంటల్లోనే నేరస్థులను గుర్తిస్తున్నట్లు సిద్దిపేట కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. టెక్నాలజీతోనే ప్రస్తుతం వినాయక మండపాల భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు.
![ఆధునిక టెక్నాలజీతో వినాయక మండపాల పర్యవేక్షణ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4359945-thumbnail-3x2-lll.jpg)
Monitoring of Vinayaka Mandapas with modern technology
ఆధునిక టెక్నాలజీతో వినాయక మండపాల పర్యవేక్షణ
ఇవీ చూడండి: యాదాద్రి శిలలపై కేసీఆర్ శిల్పాన్ని చెక్కినారే..!