mobile she toilet:బయో టాయిలెట్... శౌచాలయ సమస్యకు చక్కని పరిష్కారం సభలు సమావేశాలు జరిగినప్పుడు, దూరప్రాంతాల నుంచి ప్రయాణం చేసొచ్చినప్పుడు చాలా సందర్భాల్లో శౌచాలయాలు లేక ఇబ్బంది పడినవారుండరు. ఇదే సమయంలో సాధారణ మహిళలతో పాటు పాలిచ్చే తల్లులు తమ కష్టాన్ని పైకి చెప్పుకోలేక తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా అత్యాధునిక వసతులతో మొబైల్ టాయిలెట్‌ను (mobile she toilet) తీసుకొచ్చింది సిద్దిపేట (siddipet) పురపాలక అధికార యంత్రాంగం.
సుమారు రూ. 20 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ సంచార శౌచాలయంలో (mobile she toilet) నాలుగు టాయిలెట్లు, ఇద్దరు వేచి చూసే గదులు, సెల్‌ఫోన్ ఛార్జింగ్‌తో పాటు పిల్లలకు పాలు పట్టుకునేందుకు వసతి కల్పించారు. వీటితో పాటు బస్సులోపల విద్యుత్ సౌకర్యం కోసం సోలార్ సిస్టం అమర్చారు. బస్సు నిర్వహణను కూడా శౌచాలయాలు నిర్వహించే ఏజేన్సీకి అందజేసి సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు మున్సిపల్ అధికారులు.
తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా ఏదైనా కార్యక్రమాన్ని చేపట్టాలని తలంచాం. సభలు, సమావేశాలు జరిగేచోట, రద్దీగా ఉండే ప్రాంతాల్లోను, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు శౌచాలయాలు లేక ఇబ్బందులు పడుతున్న మహిళల కోసం సంచార శౌచాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. తక్కువ ఖర్చుతో పర్యాటకశాఖ నుంచి బస్సును కొనుగోలు చేసి.. అత్యాధునిక వసతులతో మొబైల్ టాయిలెట్‌ను సిద్ధం చేశాం. ఇందులో నాలుగు టాయిలెట్లు, వెయిటింగ్ కోసం కుర్చీలు ఉన్నాయి. వాటితో పాటు పిల్లలకు పాలుపట్టేందుకు వీలుగా ప్రత్యేక గదిని ఏర్పాటు చేశాం. - రమణాచారి, సిద్దిపేట పురపాలక కమిషనర్.
ఏ సమస్యనైనా చెప్పుకోగలం. కానీ శౌచాలయాని వెళ్లాల్సి వచ్చినప్పుడు అందుబాటులో సరైన వసతి లేకపోతే ఆ కష్టం వర్ణణాతీతం. ఈ విషయంలో మహిళల కష్టాలకు పరిష్కారం చూపిన సిద్దిపేట మున్సిపల్ అధికారుల ఆలోచన అభినందనీయం.
ఇదీ చూడండి:cotton industry: కాటన్ పరిశ్రమ వెలవెల.. ఉపాధి కోల్పోయిన కార్మికులు