తెలంగాణ

telangana

ETV Bharat / state

నర్సారెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి - mlc-jeevanreddy-press meet in Narsareddy House

రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం ఇంజినీర్లు చెప్పినట్లుగా జరగడం లేదని.. కేసీఆర్ చెప్పినట్లుగా జరుగుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి ప్రాజెక్టులను రీడిజైన్ చేస్తున్నారని ఆరోపించారు. గజ్వేల్​లో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని ఆయన నివాసంలో పరామర్శించారు.

నర్సారెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

By

Published : May 18, 2019, 11:41 PM IST

మల్లన్నసాగర్, కొండపోచమ్మ భూ నిర్వాసితులకు అండగా నిలిచేందుకు ఆమరణ దీక్ష చేసిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శించారు. సామర్థ్యానికి మించి భూసేకరణ చేపట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నారని విమర్శించారు. నిర్వాసితులకు సరైన పరిహారం చెల్లించకుండా నిర్మాణాలను చేపడుతున్నారని ఆరోపించారు. అధికారం శాశ్వతం కాదని ప్రజలు తిరగబడితే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పదవి కోల్పోక తప్పదని జీవన్​రెడ్డి హెచ్చరించారు.

నర్సారెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details